పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

382

కళాపూర్ణోదయము




యొక్కొక నెపంబుతో దానియొప్పదంబు
గనుఁగొనుచు నెట్టి కేలకుఁ జనియెఁ దిరిగి.241

వ. అంత నక్కాంతయు నంతరంగంబునం గాంతుఁ జింతించుచు.

ఉ. అమృదుపాదపద్మములు హ స్తతలంబున నొత్తం గోరు నా
శ్రీమహనీయవక్షమునఁ జేర్పఁగఁగోరుఁ గుచద్వయంబు నా
కోమలగండ పాళిక లఁ గూర్పఁగఁ గోరును గండపాళికల్
కాముని బారి కగ్గమయి కామిని తాలిమి చంచలింపఁగన్.

ఉ. అప్పుడు తత్ఫయోజముఖియాకృతి చందము బోటులందఱుం
దప్పక చూచి యక్కట వృథావన ఖేలలహాళి నించు కే
నిప్పడుచుం దలంపము మృగేక్షణలార గణించి చూడుఁ
యెప్పుడు నే వినోదములు నీ చెలి కింపులుగా వొకింతయున్.

ఉ.ఈనళినాక్షి చింత హరియింత మొకింత పరాకు చేసియ
న్పూనికతోడ వచ్చి మనపోకడ లేమని చెప్ప నాట లే
కాని నృపొత్మజం దలఁపఁగానము దీనివిచార మేమియున్
మానుట లేద మిక్కీ లి ఘనం బగుచున్న దిగాని యెన్నఁగన్

వ. అదియునుంగాక.146

స. శ్యేనం పాతావిహారాశ్రయణమధుర వే
షంబుతోఁ జూడ్కి వేడ్కం
బూనంగా నింతకున్ ము న్పురుష మణి కళా
పూర్ణుఁ డే తెంచి పేర్మిన్