పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము.

381


ఉ.వర్ల సపాత్రచిత్రగుణ వైభవశోభితుఁ డ త్తఱిఁ గళా
పూర్ణుఁడు డేగ వేఁటతమిపూన్పున వచ్చి ముదంబు సం దద
భ్యర్ణ మహిం జరంచు చొకపక్షికి బాఱి డేగఁ బిచ్చుచుం
దూర్ణత నేఁగె నానిజవధూటియు బోటులు నున్న చోటికిన్.

వ. అప్పుడు.237
 
ఉ.నిద్దపుఁ జెక్కుటద్దముల నింపులుగాఁ బులకల్ జనింప న
మ్ముద్దియబోటిమూఁపుపయిమోమరదోఁపఁగనిల్ఫియత్తఱిం
దద్దయుఁ బ్రేమఁజూ చె నిజనాధు నతండునుదానిఁజూ చెనా
యిద్దఱచూపులు న్నడుమ నించుక తార్కొని లజ్జ గ్రమ్మఱన్

చ. వసజదళాక్షి చూచినను వల్లభుచూపు లతండు చూచినన్
వనజదళాక్షి చూపులు ఘనత్రపచే వెను వెన్కకు న్వెసం
జనుచు నొకొళ్లొ కళ్లకయిసారెకువచ్చుచుఁబొల్పుమీ ఱెఁగ
న్గొన రతి పంచ బాణులవినోదపుటుయ్యెలచేరులో యనన్ .

చ.వినుకలిచేత ము న్మిగుల వింతలుగాఁగ విరాళిగొన్న య
వ్వనజదళాక్షి యట్లు తనవల్లభురూపము గన్ను లారఁగాఁ
గనుఁగొని యేమి చెప్పఁ గడుఁ గంతుశ రాహతిఁ దాప మొం
దుచు, స్మనమునఁ గుందె నప్పు డటు నాధునిఁ గౌఁగిటఁ జే
ర్ప లేమికిన్.240

గీ.అతఁడు మధురలాలసయందు సాత్మ దగిలి
మగిడి రా కలయింపఁగ మరలి మరలి