పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380

కళాపూర్ణోదయము.



లయ. ఓల యనుచున్ వలదు గేలి యనుచుం బఱవం
జల వనుచుం గడుఁ బిసాళివనుచుం బ
ద్మాళిఁ గొని కోట్టుచును దోలి వడిఁ బుట్టుచును
మేలములఁ దిట్టుచు గయాళితన మింకం
జాలు సనుచున్ బలిర గోల యనుచుం బగట
నేల యనుచున్ ముగుద బాల వరుచుం గ
య్యాల వెసఁ బెట్టుచును హాళిఁ జలపట్టుచు సు
మాళములఁ గిట్టుచును బాలికలు వేడ్కన్.

కవి. గుభులు గుభుల్లను ఘోషణఁ దోయళకుంతతతు ల్గలగుండు
వడన్ , క్షుభితఘన స్తనకుంభపరి చ్యుతకుంకుమచంద సకుంత
లసూ, సభరవిలాసమున న్బహువర్ణము నవ్యసుగంధ గుణం
బుకొలం, కభినుతి భాజన మై భజియింపఁగ నాగతి నంబువి
హారిణు లై.233

నూలి. తడిసి తనువులన్ భేదంబు గాన్పింపకుండం
గడు నడఁగిన చేలల్ కల్కి స్రుక్కు ళ్లపట్టే
ర్పడఁ దెలుప ఘనాంభోభారతం గుంతలంబుల్
మడమలషయి వ్రేలన్ మ త్తమాతంగయానల్.234

వ. కాసారంబు వెలువడి నవీనవస్త్రాభరణగంధమాల్యంబుల న
లంకృత లై రి మధురలాలసయుం గాంతునిమీఁదిపరాకునఁ
దోడి చేడియలబలిమిని వన క్రీడాదు లెట్ట కేలకు నిట్టట్టు సలు
పుచుండే235