పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

379

షస్థాశ్వాసము.


 
మునుపుగాఁ జొచ్చినవనితలు చల్లెడ
యుదకంబునకుఁ జేతు లోడ్డుకొనుచు
నెడ నెడ మిట్టించి పడుమిల బెళుకుల
కులికిపా బొదవంగ నోసిలుచుఁ

గీ. బొగలమఱుఁగుననుండి బి టైగయువిహగ
కులమురవళికి బెదరుచూపులు దలిర్పఁ
దమ్మి కొలను ప్రవేశించుతలిరుఁబోండ్ల
విలసనము లంత యెంతయు వింత లయ్యె,
229

ఉ. ఆరమణీమణుల్ సరసి నట్లు ప్రవేశ మొనర్చు వేళఁ ద
త్కారణవీచికాచలితకంజములన్ మధులో లభృంగముల్
వారక సొ రెకు న్నెగసి వ్రాలుచు నొప్పెఁ దదంబు దేవతల్
నేరుపుతోడ నాడుహరినీల పుటచ్చనగండ్ల కై వడిన్
230


లయ. నెమ్మొగములం గరతలమ్ములఁ గుచములఁ
గచములను జూడ్కి నయనములఁ బరాభూ
తములునుబోలె విరిదములును ర క్తజల
జములును గోకమిథునములును శైవా
లములును భృంగనిచయములును మీననిక
రములుఁ గలం గెఁ జలసములు భజింపరి
గొమ్మలపు డెంతయును సమదకుతూహలభ
రముల నొనర్చిరి కరము జల కేళిన్.
231