పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

కళాపూర్ణోదయము


  

ను వడఁకెడుకులుకుబెలుంగులునుం గలిగి యపూర్వవిభ
మంబున సొంపుమీఱుచుం దదనంతరంబ.225

క్రౌంచ. చంచలవీ చీసంచయలీలాసలలితతరళిత జల రుహపాళీ
సంచితహస్తోదంచిత భంగీజనితమదనమత సరణి గుణ వ్యా
ఖ్యాంచిత గోష్ఠీ సంచరణ ప్రత్యయ సముచితహళహళిక లతో
రా,యంచలు ఘోయం గొంచలు గూయన్ వ్యవహితపర
రవమయినకొలంకున్.226

ఉ. చేరఁగఁ బోయి రంగనలు చెల్వగుమోములసోయగంబు త
ద్వారిజలక్ష్మిఁ గేరఁగ నవా రితవారితరంగరంగలీ
లారతహంససార సకులస్టలదారవసారవంచనా
పారగనూపు రా దిబహుభ వ్యవిభూషణ ఘోష మొప్పఁగన్

ఉ. అంతట నంతరంగముల నంబువిహారకుతూహలంబు ల
త్యంతముమీజుమెట్లుడిగి రామగువల్ మునికొంగులూరుగా
ఢాంతరసీమఁ బట్టుచు జలాశయలక్ష్మిపయి న్న ఖచ్చటా
కాంతుల చేఁ బదాబ్దములు కప్రఫుధూళి వసంతమాడఁగన్

సీ. అలఁతి గాడ్పుల చేతఁ దొలఁగుపయ్యెదకడ
లిరువంకలను జిక్క నిటికికొనుచుఁ
దరఁగల ని టట్టుఁ దరలుముంగొంగులు
తిరుగ జంఘలను సంధించుకొనుచుఁ