పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

కళాపూర్ణోదయము

   
     కల్పశాఖిని గెల్చి కర్ణుకీర్తి మరల్చి
                  ఖచరువార్తఁ దరల్చి ఘను వదల్చి
     కందర్పు మఱపించి యిందుని నిందించి
                  నలకూబరు హసించి నలుని మించి

గీ. తనరుకీర్తి ప్రతాపవదాన్యతాసు
     రూపవిలసనములచేత రూఢి కెక్కె
     ధరణి నంద్యాల నరసింగనరవరేణ్యు
     పట్టి యైనట్టిమూర్తిభూపాలకుండు. 76

వ. తదనుజుండు 77

క. తిమ్మక్షితిపతి శోభిలు
     నిమ్మహిలో మిగుల వాసికెక్కెడుగాంభీ
     ర్యమ్మున ధైర్యమ్మున శౌ
     ర్యమ్మునఁ బ్రఖ్యాతుఁడై జనావళి పొగడన్ 78


సీ. శ్రీపుత్త్రతులనానురూపంబు రూపంబు
               నిర్మలాంగిరసవినీతి నీతి
    మహనీయతానుపమానంబు మానంబు
               భూతిమద్రిపుదావహేతి హేతి
    ధాత్రీసురశ్రీనిధానంబు దానంబు
               తులితమారుతిభీమబలము బలము
    గోవిందచింతాస్వభావంబు భావంబు
               కోవిదబంధుసంతులము కులము