పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కళాపూర్ణోదయము

గీ. నందనులఁ గాంచె నలువుర నందనద్రు
   మానువర్తనకీర్తనీయానవరత
   దానముదితార్యతతుల ననూనమతుల
   రమణఁ దిమ్మాంబయందు శ్రీరంగరాజు. 56

గీ. అట్టిశ్రీరంగవిభుద్వితీయానుజునకుఁ
   గనకవసుధాధిపతికిని గలిగె సుతుఁడు
   ధరఁ గనకగిరియౌబళేశ్వరుఁ డనంగ
   నభినుతాహ్వయుఁ డగుచుఁ బెంపారు ఘనుఁడు. 57

వ. ఇది వరదరాజువంశక్రమంబు. 58

గీ. ఇట్టి వంశాభివృద్ధికి హేతువులయి
   తనరు సౌజన్యనిధు లన్నదమ్ము లెపుడుఁ
   దనదుసౌభ్రాత్రమునకుఁ జిత్తముల నలర
   వెలసె నంద్యాలనారపృధ్వీవరుండు. 59


క. ఆనారక్షితిపాలుఁ డ
   నూనశ్రీవిభవసముచితోద్వాహవిధిం
   బూని వరియించె నిజరూ
   పానుగుణం దిరుమలాంబ నధికప్రీతిన్. 60

గీ. పుణ్యకులశీలమహీమలప్రోక యనఁగ
   నిష్కళంక పాతివ్రత్యనిధి యనంగ
   వెలయునంద్యాలనారభూవిభునిదేవి
   పరమశుభగుణనికురుంబ తిరుమలాంబ 61