పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

కళాపూర్ణోదయము.



జగతి యే లెదు తక్కి నా సందియంబు
లన్ని యును నూని నానూట యాచరింపు.197

సీ. అనుడు నల్లేని నాయాత్మచందము విను
మట్లేను మాఱు మేనత్త నందు
రాజనౌటకును గారణము లున్న వియ యిం
కను బవిత్రులయింట జనన మొందు
కాంక్ష చే నిప్పు డీకరిమేశ్వర పుఁజఱి
నుఱుకుచున్నాఁడను మఱియు~ గొంత
మదిలోని మెర మెర మాన దేమిటికి నం
టేని నెంతటి రాజ నైన నెట్టి

గీ. పావనులయింటఁ బుట్టిన బహిర బహిర
రాతివర్గ జయం బజస్రమును గలిగి
వర్తిలుట యబ్బురము గాన వగపు గలదు
చితమున నాకు నోమహాసిద్ధవత్య.198

ఆ. అదియుఁ గాక రాజ్య మనుమహాభూతంబు
సోఁకినప్పు డెట్టి సుజనులకును
లేనిచీకుఁదనము లేనిమూఁగతనంబు
లేని చెవుడుఁ గొంత యైనఁ గలుగు.199

గీ. వేదశా స్త్రాదిసకల సద్విద్య లందు
నెందుఁ గొద యించుకయు లేక యెసఁగునట్టి