పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

కళాపూర్ణోదయము



 ర్తనం బంతయుం జెప్పి శారదా దేవి యాసుగాత్రీశాలీనుల
కు నిచ్చి కవరంబు లెట్లు ఫలితంబు లగునో యని యొకింత
చింతించి యవి యటట్ట సఫలంబులు గాక మానవుగా యని
నిశ్చయించి మణికంధరున కి ట్లనియె.191

సీ. నారదుపరిచర్య చే రుక్మిణీ కాంతు
శిక్షను సంగీతసిద్దిఁ గనుట
ర మ్మౌనిక రుణ చే హరిభ క్తి తీర్థయా
త్రాది పుణ్యంబుల నతిశయిలు ట
నడుమఁ బ్రమాదంపునడక ఁ జేకుఱనశా
షము రాజ్యఫలముగాఁ బను పడుటయు
నధిక పుణ్యప్రాచ్య మైనగంధర్వజా
తిని సముద్భవమంది తేజరిలుట

గీ• యూహ సేయంగ నీ వింక నొందుజన్మ
మమిత సాద్గణ్య సంపన్న మగుట ధ్రువము
పుణ్య వాసన లూరక పోవు సూ వె
యెట్లుఁ దమతమఫలముల నిచ్చుఁగాని,192

క. సుగుణగణైకనివాసం
బగుజన్మము నీకుఁ గలిమి కాదిమ హేతూ
పగమంబ చాలు నిచ్చటి
భృగుపాతంబునకు నే మపేక్షిత మింకన్,193