పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

కళాపూర్లోదయము


ద్వన్మయం బిట్లుండ: దరుణి నీమది కస
మృత మైనయట్టి ది మహి వెలయు నె
యాకళాపూర్ణ మహా రాజుకథ తావ
కీనకృంగారలీలానిమి త్త
మగుచు మన్ముఖజాత మగుచు నవశ్యంబు .
గరము ప్రసిద్ధంబు గాఁగలయది

 నీకుఁ బ్రియ మని వేజు వర్ణింప నేల
నీ విపుడు పలు- పల్కు స్వాభావికంబ
పతులయనురాగలీల లేపగిది నెన
వెలయఁ గోయు దాఁచు టింతులగుణంబు. 29

వ. అనిన విని యాభారతీదేవి యవారిజాసనుం జూచి మీర
అంత చలమఃఁగొని సమర్థింప నాకు నౌఁ గా దన నేల యది
యును గాక భూరాజు వాలాయంబుగా ధరణిం బుట్టఁగ
లండఁట రాజ్యంబును, జేయు నఁట యతనిచరిత్రం బెట్లును
వెలయంగల దఁట యిది సిద్ధంబు దాని సంగడిన యస్మద్ర
హస్యకథ వెలయుటకు నియమంబే యనుటయు నంత డిది
మునుపును సది వెనుకయుం గా వెలయు నని పలుక నట్లేని
వెలయు భంగు లెవ్వియో యెఱుంగవలయు మీర లెక్కడ
నుడువకుండుం డని ప్రార్థించి నుడువ ననిపించుకొని నన్నుఁగ
నుంగొని యిది యిప్పుడు వారాంగ నాజన్మంబునఁ బుట్టను
న్నయది యందు నేతద్బోధశంక నెరయ లేదని పలికి రంభ