పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9

ప్రధమాశ్వాసము

   
 భూభువనప్రశంసాభిశోభితమహా
              ప్రాభవాడ్యుఁడు కుమారౌభళుండు
      శరదిందుచంద్రికాపరిశుద్దవిహసన
              స్ఫురదనర్గళకీర్తి వరదరాజు

   గీ. ప్రచుర విక్రమరఘుపతి రఘుపతియును
      దనయు లేవురు గల్గి రుదాత్తసకల
      గుణగరిష్ఠులు నరసింగ కుంభినీత
      లాధినాధున కమ్మాదమాంబయందు. 28

   క. నరసింగవిభునిసింగరి
      నరవరుఁ డసమానుఁ డధికనయసారత ని
      ర్భరశూరత నతిధీరత
      నరు దగుదానక్రియావిహారత నిలలోన్. 29

   క. నారాయణభక్తుఁడు సుజ
      నారాధనపరుఁడు జలరుహాక్షీసుమనో
      నారాచుఁడు నరసింగయ
      నారావనిపాలకుండు నరనిభుఁడాజిన్. 30

   సీ.స్వారాజభావంబు కారణంబుగ నేమొ
                  శక్రుండు నెలవున జడియ కునికి
     మిత్త్రపుత్త్రత దాను మిత్త్రుండ నని యేమొ
                  యముఁ డాత్మపురమునఁ దెమల కునికి