పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

233

చతుర్థాశ్వాసము.


యింక నీ వేమని చెప్పెదో చెప్పు మనుటయు ఇవ్వనితో
మణి యి ట్లని చెప్పె ట్లు శాలీను కు మడువున బడుటకు
మునుపు నాతో నేత:బుళ నుండి ప్రసంగవంబు

క. అమృతము సేవించితివో
రమణీ యే మైన సిద్ధరస మబ్బెనొ నీ
కొమరంబ్రాయము మిక్కిలి
కొమ కొందెడు 5కముఁ గ్రోత్త కొత్తగ నెలమిన్. 123

క. మగవానికంటె మునుపుగ
మగువ కెడలుఁ బ్రాయ మండ్రు మానవతీ నీ
జిగిబిగువు లంత కంతకు
మిగులఁగఁ బొలుపొందుటకు నిమి త్తము చెపుమా. 124
.
క. అని యడిగిన నే నెయ్యది
యు నిమి త్తం బెఱుఁగ వనుడు నూరక యిట్లం
టిని గాని యేన చెప్పెద
విను మని మొగము చెఏఁ జేర్చి విభుఁ డిట్లనియెన్. 125

చ. అనిశము నీదుయౌవనశుభాకృతిఁ గౌఁగిటఁ జేర్చు వేడుకు
దనియమిఁ జేసి వేఁడితిని దక్కక నీకును గర్భ మెస్న ఁడుం
జనితము గాక యుండ నలశారదఁ బూజ యొనర్చు వేళ వా
రనికృప నట్ల యిచ్చితి వరం బని యాయమ పల్కె నత్తజిన్