పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

కళాపూణోదయము.


క. అని యిట్టటు నా చేఁ ద
ద్వినుతులు సేయించి మెచ్చి విశ్వహితార్థం
బును జెప్పించిరి త్రిజగ
జ్జననీ పరమపద నా సువాదకధల్.38

క, చెప్పించి యీకవితచే
నిప్పుడు గాకున్న నీకు నిక నాళమేసం
దష్పక యొదవుఁ విరంబుగ
సప్పరమునిపరమభకి యని రధికదయన్.39

వ. ఏనును దాదృశం బై - మదీయకవిత్వధార శారదాపీఠఁబు
నందలియందణి వినుతి కెక్కుందాఁక మిక్కిలి మెచ్చుకొన
రా దని యచ్చోటికి నంత సరిగితి నని పలికి యింకఁ బ్రకృత
కధ వచ్చుచున్న ది యాకర్లింపు మట్లు శారదాపీఠంబునకు
నేఁ జనునప్పుడు తత్సన్ని ధియందు.40

సీ. ఋగ్వేద ఘోష సమృద్ధి పెం పొకచోట
నొక చోట యాజుషాభ్యుదయమహిమ
సామగాన ధ్వానచాతుర్య మొక చోట
నొకచోట నాధర్వణోక్తి గరిమ
గృహ్యసూత్రని పాఠఖేలను బొక చోట
నొకచోట శబ్దతంత్రోపచయము
జ్యోతిష సిద్ధాంత సంఘర్ష మొక చోట
నొకచోట ధర్మశాస్త్రకలనంబు