పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196 కళాపూష్ణోదయము.

ఉ. శ్రీయుత మైనదివ్యమణి చేతికి నబ్బఁగఁ బాజ వైచి త
చ్చాయయొకింతయుఁగని చాలఁగృశించితి గాజుపూసకై
నాయఏ వేక మే మనుకొను దుదఁ దన్మణి య బ్బె నన్నన
త్యాయతతత్సమాగమసుఖా స్త్రీకి నోఁచమి నెంచి కుందెదన్

ఆ. ఇట్టి మాట లిప్పు డే నాడుకొనుటయు
ననుచితంబు వారవనితపలుకు
లిచ్చకుబు లనక యెవ్వరు నమ్మెద
రదియుఁ గాక దృష్ట మన్య వాంఛ.

వ. అస్ లజ్జాకోకంబు లడర నవనత ముఖ మైనకల భాషిణిం జూ
చి మణికంధరుం డిట్లనియె నోయు తమవిలాసిని నిన్ను నితర
వారవనితలయ ట్ల సత్యపొదీనిగాఁ దలుప నఁ తవి తవాఁడనే
నీపలికినట్ల నీకు మున్ను నాయందు గోరిక గలుగుటకు గుఱు
తొకటి యున్నది యది యెద్దియు టేని నారదుండు కడపట
నిన్ను నింటికి ననుపుచు నేను విస నీతోడ.

గీ. కొమ్మ నీ వాత్మలో మును గోరినట్టి
కాంతు రంభామనోహరాకారుఁ డగుచు
మేజయువానిని గూడి రమింపగలవు
నమ్ము పొ మ్మిళ నీభవసమున కనియె.

క. నలకూబరుఁ గూడెద వని
పలుకక య ట్లనిన సత్య భావణుపలుకుల్