పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192 కళాపూర్ణోదయము.


శ. అమ్మెయిఁ జెప్పియు నతఁ డపు
డన్మయారంభ యి.3 యటంచు నను బ్రకా
శమ్ముగఁ జేయక కారు
ణ్యమ్మున మన్ని చె మన్ముఖాకృతిఁ గనుచున్.

వ. అది యెల్లఁ జెప్ప నేను గడపట నట్టిశాపంబునకుఁ గారణం
బైనయారూపు గోసి యది యంతయు నుజ్జగించి యవశ్య
భోగ్యం బై శతచ్చాపఫలం బిద్దేవి సన్నిధి నను భవించినఁ బరో
పశారం బగు నని వచ్చితి నని చెప్పి కలభాషిణి యమ్మణి
స్తుభుక కిట్లనియె.

తే. నీదుగురుఁ డన్నయట్ల నీ నిశితఖడ్గ
మవితథోద్యమ మగుట సువ్య క్త మయ్యెఁ
దిరుగ నన్నును నిన్ను ను దెచ్చె దైవ
మిచ్చటికి ధన్య నైతి నీయిష్ట మొందు.

చ. అవి యటులుండె నాపడు ప్రయాసము లూరకపోకయుండన
ట్లాద వెఁ బ్రియు సృజింపనని యుండఁగఁ జెప్పితినీవు దానికిం
గొద గలుగుగ సత్యనలకూబరుఁ డొక్కఁడు వేఱవచ్చియా
తుద నతనిన్ శపించె సని తొల్లిపోయాక పటాత్ముఁడెవ్వఁడో

క. అన విని యేమియు మిక్కిలి
యనఁబోయెదుసుమ్ము తరుణి యట్లారూపం
బున నున్నవాఁడ నేఁ జు
మ్మని మణికంధరుఁడు వల్కె నల్లన నగుచున్,