పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళాపూర్ణోదయము


చతుర్థాశ్వాసము.

శ్రీ సౌభాగ్యవిభూతివి
లాసాలంకార నిత్య లలితాకారా
భాసురయశః ప్రసూనసు
వాసితసకలాశ కృష్ణవసుధాధీశా.

వ. అవధరింపుము.

సీ. ఆవధూమణి నవ్వి నావర్తనము నీవ
చెప్పితి వింక నేఁ జెప్పఁ గలదే
గురుసత్వుఁ డగునలకూబరు చేఁ బట్టు
వడి నీవు ననుఁ జూపఁ గడఁగి యట్లు
వచ్చుచో నెదురుగా వచ్చినరంభ నేఁ
జుమ్ము నిన్ విడిపించి యమ్మెయిఁ జని
యభిమతం బైన య ట గజలీలావి
హారంబు సలిపితి నంతలోన

గీ. నరుగుదెంచినయదియ సు మ్మాద్యరంభ
యూరమణిఁ బ్రాణవిభుదండఁ జేరనీక
యవ్విడంబునఁ బోరాడి యంతమునను
దద్దతిని శాష మొందినదాన నేన.