పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170 కళాపూర్ణోదయము

క. నావుడును దధ్యమిధ్యా
భావంబుల కేమి నీకు భావింపఁగ స్వా
భావిక మే యీయాకృతి
భావము నిజ మెదొ యీ ప్రపంచమునందున్ .

క. నీప ట్టురువడ నొక్క తేఁ
జూపి యొక తెగర్వ మడఁచుచున్ వలయుగతి,
బ్రాపింపవచ్చు భోగము
నీ పుణ్యం బినుమడించి నేఁడు ఫలించెన్ .

ఉత్సా. అనుడు నోమహాత్మ పెద్ద లైన వారిఁ దడవుగా
నునిచి యిట్టు నట్టు పలుక నొప్ప కేమి వచ్చునో
చనుఁడు నిలుప వెజతు సనినఁ జనియె నాతఁ డట్ల యా
ననుచు నుచితలీల నుండు మనుచు నల్ల నవ్వుచున్

సీ. అర్దేశనందనుఁ డంతట నెప్పటి
తనపువ్వుఁబోఁడీ కై దండ గొనుచు
నిది యెంత లేదు నెమ్మది నిట్టివిఘ్న ముల్
గుజి చేసి మన కేలి మజవ నేల
రమ్మంచు రెండవరంభఁ గనుంగొని
నీ వెంత నేర్పులు నెఱపి తేని
మాయ లే యని తోఁచు మాకుఁ గావున నీదు
సత్య మెఱింగింపఁ జాలినట్టి