పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160 కళాపూర్ణోదయము.


యద్భుతంబు నొందె యజేశసుతుఁడు స
వ్విధముఁ జూచి యేను వెఱఁగుపడితి.

ఉ. అంతట యక్ష రాజసుతుఁ డాకరణిం జనుదెంచి యున్నయా
కాంత ప్రకారముం దనదు కాంతప్రకారముఁ గొంత ప్రొద్దు వి
శ్రాంతమహావధానమునఁ గ్రమక్రమ్మజి చూచె నెందునొ
క్కింతవి భేద మేర్పడమి కెంతయు నద్భుత మావహిల్లఁగన్

క. ఈమాడ్కిఁ జూడ నను న
క్కామినిఁ గడుఁ దిరిగి తిరిగి కనుఁగొనియెదు నీ
వేమి యిది నాకుఁ జెపుమా
నీమది యని యతని నతని నెలతుక పలికెన్.

వ. ఇట్లు పలికిన సతండు.

గీ. నీదు ప్రతిబింబ మదియొ దాని ప్రతిబింబ
మివొ యే మని చెప్పుదు నిగురుఁబోఁడి
యేర్పఱుపరాకయున్న వా రీవు నదియు
దీని కరుదంది చూచెదఁ దిరిగి తిరిగి

క. తుద నేమి చెప్ప నాదం
డ దొలంగిన దాని నినుఁ దడంబడకుండన్
మది రాక్షి యేర్పరించుట
సుదుర్లభ మటన్న నతనిసుదతి గలఁగుచున్ .