పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156 కళాపూణోదయము.


బా రారమ్మటు దానిఁజూపుదువు ప్రాయశ్చిత్తమామీఁదనీ
కేకతిం దగున నర్తు నని తా నెం తే నమర్షంబునన్ .

వ. కొంత మేర నన్నుం గ్రమ్మఱఁ దెచ్చునంత.

సీ. తిరముగా ముడువమి విరియఁ బాతెడుకొప్పుఁ
దోగోన నొక కేలఁ దుజుముకొనుచు
వల్లెవాటుగఁ గొంత వలువ చవ నిల్చి
పిచేత నీవిఁ గల్పించుకొనుచు
నుదుటిపై నొక్కింత చెదరినముంగురుల్
పాపటకును బొందుపజచుకొనుచుఁ
సారెకు జా టెడు శ్రవణకహ్లారంబు
లందంద మూఁపున నానుకొనుచుఁ

గీ. జెమట నంటిన పానుపుచిత్రురుఁదునుక
లెడనెడ నఖక్ష తాశ్వకఁ దడవుకొనుచు
రంభ యే తెచె మిగుల సంరంభ మమరణ
దొలుతఁ బ్రియుఁ డేఁగుదెంచినత్రోవపట్టి.

శా. ఈలీలం జనుదెంచి యక్కటకటా యేమంచు నిన్లూజుదుం
గేలం గెదువు గీదు వేమియును లేకే యిమెయిన్ వత్తురే
చాలున్ దూరముగాఁగ నే నిదెపరిశ్రాంతిం గడు న్నొచ్చితిం
జాలుంజాలుఁగరంబు 'మెచ్చఁదగు నీచందంబు ప్రాణేశ్వరా.

వ. అని తసదుప్రియుం బలికి నన్నుం గనుంగొంచు నతనితోడ.