పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శృతీయాశ్వాసము. 153


నాఁడ నది యొక్క రితోడం జెప్పెడునందాక హృదయం
బు వేగిరషపుచున్నది కావు, సన్ని టం బూజ్యురాల పైన
నీకు వినిపించెద నని యిట్లనియె.

ఉ. ఆవిధి నీవయిం దిగి మదాతిశయంబునఁ గన్ను గానమిన్
దేవతమీఁదియానయు గశింపక యీకలభాషిణిన్ శివో
జావళివట్టి త్రుచుటకు నాయుధ మెత్తితి నెత్తినట్టి కేల్
దేవి గ్రహించి వైవఁ జనితం గడుదవ్వుగ నివ్వషూటితోన్.

మ. అనుడు న్నీ విది చెప్పఁగా వలవ దే నామున్న యీరూపుఁ గై
కొని వీక్షించితి నిన్ను నీచిగురుటాకుంబోఁడిమూర్గంబు వ
ట్టిన కేల్ పట్టినయట్ల యుండ దృఢముష్టిం బూని బల్గ తియె
త్తిన కే లెత్తినయట్ల యుండ దిప్ ను ద్వేగంబునం బోవు చోన్

క, వినిపింపు నాకు నటమీఁ
దన నతఁ డిట్లనుచుఁ జెప్పె నట్లురువడి దం
చనమున వైచినగతి నభ
మునఁ జని మణికంధరునితపోవనభూమిన్ .

క. ఇతరుణియు నేనును నొక
మెత్తని క్రొత్తలిరుఁ బాన్పుమీఁదఁ బడితి మో
మత్తేభగమన యట్లే
సత్తియ కృప సేయఁబోలుఁ జావక యుండన్.