పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

146 కళాపూర్ణోదయము, M సీ. నిండు చందురు నవ్వునెమ్మోముసిరితోడ నిరులు గ్రమ్మెడు వేణీభరముతోడ నాకర్లలో లంబు లగు నేత్రములతోడఁ దళుకొత్తు చెక్కుటద్దములతోడఁ మిగుల మిటారించుబిగిచనుంగవతోడ లలితంపు బాహువల్లరులతోడ నతికృశత్వమున జవ్వాడుమధ్యముతోడ సభినవం బైననూఁగారుతోడ గీ. వలువమీఁదిఁకిఁ దొలఁకుసువర్ణపులిన గురునితంబ ప్రభాపరంపరలతోడ మహిత సర్వాంగలావణ్యమహిమతోడ నమరుప్రాయంపురపు చిత్రముగఁ దాల్చె. 30 033 గీ. తాల్చి యావికచోత్పలదళనిభాక్షి కనుఁగొనియె నభ్రమున శ క్తికరవినున్న గాత్రు సిద్ధుని నొక కేలఁ గత్తి యొక్క కేలఁ గలభాషిణిని విడ కే చనంగ. క. ఆకరణిఁ జూచినది యె యాకలభాషిణియవస్థ కాత్మఁ గలఁగుచున్ వ్యాకులత నొందెఁ దనదుచి రాకాంతి తసిద్ధి పెంపు నరయనిమదితోన్. 133