పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

184

కళాపూర్ణోదయము.


వ. సిద్ధండు నంతఁ దద్దమననిరోధకారణంబు తలంచుకొనియా చంచలాక్షి తోడ.

క. తరుణీ వెఱవకు పల్లపు
మరగొమ్మేమఱకు నాకు మర్యాదావి
స్మరణం బైనది మాటల
పఠాకు చే సనుచుఁ దనదు పారీంద్రంబున్.

89

వ. కొన్ని యడుగులు దిరుగఁబట్టి ధరణికి దిగఁ దోలుకొని వచ్చి యచ్చట నచ్చెలువతోడ నవరోహణంబు సేసి కేసరిని మేఁతకు విడిచి యోషడఁతీ యీముందట మృగేంద్రవాహస యనుశ క్తిగలదు తన్మందిరంబు ముందటి నున్న మృగేంద్రం బునకుఁ గ్రింద మీఁదం జుట్టు పట్టున నెట్టి బెట్టిదంపుసింగంబులుం జన 'వెఱచు నిది మఱచి యే సెంత తోలిన మన వాహనం బెట్టెదిరి నడచు మనము నమహాశక్తికి సభివందనంబు చేసి పోయినం గార్యసిద్ధియగు రమ్మనుచు నల్లన తన భల్లూక చర్మకోశంబుతో డిఖడ్గంబు పుచ్చుకొని సింగంపుఁబల్లంబు సంజోకలతోడన యొకమఱుంగున డాఁచి యాచపల లోచనను మృగేంద్రవాహనగుడికిం దోడ్కొని చని తద్బా హ్యమండవంబున నునిచి యద్దేవిపూజకుఁ బువ్వులు దెచ్చెదనని బూఁదోట కరిగె నప్పుడ తెఱంగు గనుంగొని.