పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వాసము

133

క. కంఠీరవ మట్టి యెడం
   గంఠం బెగనెత్తి చూచి కదలక నిలిచెం
   గుంఠితగతి యై యెందు న
   కుంఠితగతి యనఁగఁ దొల్లి గుణము నెఱపియున్. 84

వ. అప్పుడు.85

సీ. హుంకారములతోడ నుచ్చాటనపుబద
          నికతీఁగతఱటునన్ వ్రేసి వ్రేసి
    కడు ఢాక మీఱంగ మడమలు తాటించు
         చును ముందఱికి లివ చూపి చూపి
    మొగము పార్శ్వములకు మగుడింపకుండ వా
         కట్టమూలిక వాగెఁ బట్టి పట్టి
    వడి నూర్ద్వగతిని లేవక యుండఁ దననాగ
         బెత్తాన మూర్ఖంబు మొత్తి మొత్తి

గీ. సిద్ధుఁ డధిక ప్రయత్న సన్నద్ధుఁ డగుచు
    నెంత చేసిన నాసింహ మెదుటి కడుగు
    పెట్టద య్యెను గర్జావిభీషణముగఁ
    దోఁకఁ ద్రిప్పుచుఁ గడు వెన్కఁద్రొక్కుఁ గాని.86

ఉ. అప్పుడు చాల సంక్షుభితయై పడజాఱి యిదే మిదేమయా
    యిప్పుడు దీనిచంద మనియెం గలభాషిణి మై చెమర్పఁగాఁ
    గొప్పు విడంగఁ బాఱిఁ జనుగుబ్బలఁ బయ్యెదవాయ సుస్థితిం
   దప్పి పిఱుందు పల్లటిలఁ దా మరగొ మ్మిరుగేలఁ బట్టుచున్.87