పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయా శ్వాసము

131

క. తమ పాటఁ జినుకుచినుకుల
    దుమదుమగాఁ దడిసినట్టిదువ్వలువలతో
    ఘుమఘుమ యనుపరిమళబృం
    దముతో నప్పుడొకయిం పొనర్చిరి వారల్ .74
28
వ. ఇట్లిం పొనర్చుచు నెదురైన నతండు వారిని సంభాషణక్రమం
     బున రంభాసఖు లగుట యెఱింగి యిదియేమి యనుగు నే
     చ్చెలి నచ్చట, విడిచి వచ్చితి రచ్చెలువ మణికంధరుమీఁది
     యనుగ్రహంబు వదలక యింకను గొన్ని నాళ్లు తద్వనంబున
     నిలుచునో యనుటయును నగుచు వార లిట్లనిరి. 75

క. ఎక్కడిమణికంధరుఁ డతఁ
    డెక్కడ వోయెనో యెఱుంగ మిపుడు ముదముతో
    నక్కొమ్మ పొదలుచున్నది
    తక్కక నలకూబరుండుఁ దానున్ రతులన్.76

చ. ప్రియునిసమాగమోత్సవము పెంపుననింపలరారు నామృగా
    క్షియిపుడుతద్వనిన్ రతివిశేషముసొంపులఁజిక్కియున్కి యా
    రయుచుఁదదిష్టమున్విడిచి రమ్మనఁజాలకయాకె నుంచి యే
    మ యరుగుచున్న వారమనిమానిను లచ్చటువాసిపోవుచున్

క. వేళాకోళపు దీఁ గెలుఁ
   బేలికలుఁ గళాసములును బీఱజడలునుం