పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

కళాపూర్ణోదయము

క. అన విని యీపాటిగ మీ
   యనుగ్రహము గల్గియుండ నక్కట యిఁక నే
   జనుదేక యేమి యని తన
   కనువుగ హరి నతఁడు నిలుప నంగన యెక్కెన్,69

గీ. ఎక్కి సిద్ధేశ యెవ్వరు నెఱుఁగ కుండ
   నెట్లు గొనిపోయెదో యన నేల శంక
   యెందు నెద్దులు బండియు సేక మైన
   గొండమీఁదికిఁ బోవు నోకొమ్మ యనుచు.70

క. నింగికి ధే యని కదలిం
   చెం గడు వడి గలుగుతనదుసింగముఁ బలుమా
   ఱుం గలభాషిణిఁ దిరిగి క
   నుంగొని పదిలంబుసు మ్మనుచు శీఘ్రగతిన్ .71

ఆ. మదురుగోడమీఁద మ్రాకులు చిగురుజొం
    పములు వానిమీఁదఁ బ్రచురదోహ
    దములధూపములును దనకుఁ మాటుగ గూఢ
    గతిని గాంతఁ గొనుచు నతఁడు సనియె.72

చ. చనిచనియొక్కచోసతఁడు చాలుగనక్కజమందుచుంగనుఁ
    గొనఁ దమమేఘరంజిఁ బొదిగొన్నఘనావళిలోననుండిదా
    రున నెదురైరి వైభవనిరూఢిఁ జెలంగెడుకొంద ఱంగనల్
    ఘనతర చాతురీమధురగానకళాకలనాకలాపలై.73