పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

కళాపూర్ణోదయము


   యెనకౌబేరి యెక్కడ యతని ద్వార
   కాజనులు నేఁడ చేరు ఒక్కడ లతాంగి.64

క. మించుగ మాగురువులు శి
   క్షించినయాయెక్కి రింతసింగమునకు నూ
   హించ నొక నాల్గుగడియల
   సంచారము వలయు నతని సన్నిధిఁ జేరన్ .65

వ. దీని కెంత వలసిన నేమి యిది దడవం బని లేదు నిన్ను దీని పై నునిచికొని పోయెదనంటి నేని
    యోపూఁబోఁడి తోడిసిద్ధు లిది వేఱొక్కలాగుగా నెంతు రెవ్వరియంతస్సారం బెవ్వ రెఱుఁగదు రదియునుం
    గాక మాబోంట్ల సంస్పర్శమాత్రంబు నస్మదాదులకు సమ్మతింప నుచితంబుగాదు మఱి
    వేఱొండుసామర్థ్యంబు లేదు. నాకుఁ గల దూరదృష్టి దూరశ్రవణంబు లేమియు నుపకరింపలేవింక నీవు
    చెప్పిన ప్రకారంబు గావించెదఁ జెప్పు మనుటయు నాసిద్ధునకుఁ గలభాపిణి యిట్లనియె.66

సీ. ఓసిద్ధపురుష మీరేసరణిని గొని
           చన్న నేమగుఁ దక్కుశంక గలదె
    నీమహత్త్వముఁ గాననిజడాత్ము లే మన్న
           నేమి కన్నమహాత్ము లించుకయును