పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వాసము

127

    దేవతగ నమ్మియుంటి నాజీవితంబు
    నేమిగాఁ జేసి పోయెద వెఱుగఁ జెపుమ.59

చ. అనుటయు నన్ను నిప్పుడనునట్టిదియెయ్యది నాకుఁ జెప్పుమా
    వనిత క్రమక్రమంబునను వచ్చినయట్టుల వత్తుఁ గాక నా
    విని భళి లెస్సమాట యిది వేఱొకనాఁ డిఁక మీరువచ్చి యే
    ననుఁగృపఁగా చుటల్వినుఁడు నామదిలోపలిచంద మేర్చడన్

క. ఈ వేళన యాతని కడ
   కేవిధమున నైనఁ జేర్చు టింతియ తక్కం
   ద్రోవ మణి లేదు నన్నుం
   గావన్ క్షణభంగురములు కాంతలతాల్ముల్ 61 .

క. తదుపాయము దిద్దుటకున్
   మది నెన్నఁ బ్రభావఘనులు మఱి లేరు మహా
   భ్యుదయానుభావగుణ సం
   పదఁ బొదలిన మీరు దక్కఁ బావనచరితా.62

చ. అన విని సిద్ధుఁ డిట్లనియె నంబుజలోచన నిన్ను నేడ యా
    యనకడఁ జేర్చునంతటి యుపాయము నేర్చిన నేను డాఁతు నే
    యనుకొనరాదుగాక నినుఁబ్రాణవిభుందగఁగూర్చి ప్రోచియా
    వెనుకటినీదు పాట వినువేడుక నెట్లగుచున్నవాడనో, 63

గీ. చింత సేయుము నీవ యనంతశయన
   పద్మనాభ సమీపభూభాగవర్తి,