పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

119

  
     నగు మొగము సొంపు నింత యెన్నఁడును గాన
     దీని కీవింతమహిమ సంథిలుట యెట్లు. ౨౬

వ. అని యాపల్లవాధరసల్లాపపరిరంభణాదులకు నువ్విళ్ళూరుచుఁ దదీయలీలావిహారంబు లత్యాదరంబున
    విలోకించుచుఁ దనమనంబున. ౨౭

సీ. చెలువ మోమెత్త నాసికఁజూచియో వింత
                  గతులపువ్వులు చంపకము సృజించె
    వెలఁది కౌఁగిట నది వికసించెఁ దొలుమేనఁ
                  గురవకద్రుమ మెంతపరమమునియొ
    ఘల్లున నందియ ల్గదలంగ నది తన్నెఁ
                  గాంత యక్కుజ మశోకంబ యగును
    నాతి కెంగేల నంటగఁ బులకించుచు
                  న్నది చూత మెంతపుణ్యంపుఁదరువొ

గీ. యెంతజాణయొ ప్రేంకణ మింతి పాట
    కలరె నూర్పుఁదావులకు వావిలియుఁ బోలె
    మగువనగుచూపులఁ దనర్చుమ్రాకులార
    పురుషతిలకవిఖ్యాతి మీ కరుదు గాదు. ౨౮

క. ఆ నెలఁత తేటమాటలఁ
    దేనియ లుట్టుటలు తేటతెల్లమ యదిగో