పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

118


కళాపూర్ణోదయము

ఉ. దైవనియుక్తిఁ జేసి విరతం బగుచున్న మనస్సమాధిలోఁ

బావనమూర్తి యాతపసి భామలయారొద వించు నక్షిప,

క్ష్మావళు లంత విచ్చుచుఁ దదంగనఁ గన్గొని దానిరూపుచే

తోవికృతిన్ ఘటింపధృతితోఁ గనుమోడ్చిహరిం దలంచుచున్


ఉ. కొమ్మబెడంగుసొంపుఁ గనుఁగొన్నకనుంగవ తత్తఱింపఁగా

నమ్ముని యాఁపనోప కపుడల్లన ఱెప్పలు విచ్చుఁ గ్రమ్మఱం

గ్రమ్మఱఁ గృష్ణ కృష్ణయని గ్రక్కునమోడ్చుమగుడ్చుఁ గమ్మఱం

గ్రమ్మఱమూయుమన్మథవికారము ధైర్యముఁ గ్రుమ్ములాడఁగన్


ఉ. అంతట భావికార్యఘటనానుగుణంబుగ నీశ్వరేచ్చచేఁ

గంతుఁడు మిక్కిలిం బ్రబలి కాంతపయిం బరఁగంగఁ జేసె న

త్యంతము మౌనిమానసముఁ దద్ఘనధైర్యకఠోరశృంఖలా

సంతతి యెంతయుం గుసుమశస్త్రికలం దెగఁగోసి వైచుచున్


గీ. దర్పకోగ్రప్రతాపసంతప్త మైన

తాపసునిచిత్త మప్పు డాతలిరుఁబోఁడి

చెలువ మనియెడునమృతంపుఁగొలనిలోన

నోలలాడుచుఁ దిరిగి రాఁజాల దయ్యె.


వ. ఇ తెఱంగున బద్దానురాగుం డగుచు మణికంధరుం డాగంధ

గజయానయాకారరేఖావిలాసంబు లెంతయుం బరికించి.


గీ. రంభయే యిది కాదొ లేఁబ్రాయపుఁ జెలు

వంబు నుజ్జ్వలరూపలావణ్యములును