పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళాపూర్ణోదయము

__________

తృతీయాశ్వాసము

 
శ్రీ నిత్య విహార స్థల
తానుతలీలాకటాక్ష ధర్మవిధా నా
నూనా పేక్ష విలాస
శ్రీనవ్యమనోజు నారసింహతనూజా,1

వ. అవధరింపుము. 2
క. అంతట సిద్ధుం డాసీ
మంతిని నీక్షించి యేను మదిరేక్షణ నీ
చెంతకు వచ్చుట చెవులకు
వింత చెలువు గులుకుపాట వినుటకెసుమ్మీ,3

క. కావున విపంచి గైకొని
నీ వించుక గానపటిమ నెఱుపఁగవలయున్
నావుడు నట్టుల కా కని
యావిద్యం బొద్దువుచ్చె నతనికి మిగులన్. 4

వ. ఇవ్విధంబునం గలభాషిణి తన గానవిద్యాకౌశలంబున నతని
నుబుసుపుచ్చె నంతకమున్న రంభాదులును మణికంధరుని
తపోవనంబు డగ్గఱం జని యవనికి డిగ్గి రప్పుడు.5

15