పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

కళాపూర్ణోదయము

     పద్దతి యంతయు సత్యంబ యగుట యేర్పడియె నని పలికి యిట్లనియె.186

శా . ఏ నానందన మంతటన్ వెడలి యిం దేతెంచితిన్ మున్నుగా
     నో నారీమణి యిప్పు డేఁగెడువిధం బూంచినం దత్తప
     స్థ్సానం బింతకుఁ జేరఁబోవుదురు తద్రంభాదులు న్నావుడుం
     దా నాచిల్కవచోవిలాసమున కత్యంతంబు రంజిల్లుచున్. 187

సీ. అఖిలంబునందు సత్యంతంబు వెలసి వ
              ర్తిల్లెడుశుకసంజ్ఞఁ దేజరిలుచు
    నత్యుదారాగమాఢ్యవ్యాసనందన
              భూయోర్జితానందమునఁ దనరుచు
    ఘనపక్షవిలసనంబున హరితత్వంబు
              తెల్లంబుగాఁ జేసి యుల్లసిలుచు
    నరయ నైసర్గికం బైనవిష్ణుపదైక
              గతికత్వమునఁ జాల నతిశయిలుచు

గీ. నున్నయోచిల్క నీమధురోక్తి మహిమ
    వీనుల కమృతరసములు వెల్లిగొలుపు
    చునికి యుచితంబ మిగుల నీయోగవిభవ
    మింత యం తని పొగడ నే నెంతదాన. 188

క. కావున నినుఁ బెడఁబాయఁగ
   నోవిహగవరేణ్య కొలుపదుల్లం బైనం