పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

99

ద్వితీయాశ్వాసము

     నింద్రనీలపుడాలు నేలువర్ణమువాని
                సిరి మరుల్గొలుపుమైచెలువువాని
  
గీ. మకరకుండలదీప్తిడంబరమువాని
    డంబు నెఱపెడుమణికిరీటంబువాని
    రంగనాయకుఁ గాంచి సాష్టాంగనతులు
    సలిపి తన్మూర్తియంతయుఁ గలయఁజూచె. 151

వ. ఇత్తెఱంగునం జూచి.152

చ. తమి యమరంగ నొక్కొకటి దక్కఁగ నేలెడు నౌర మద్విలో
    కముల మణీకిరీటమును గస్తురి నామము నవ్వుమోము హా
    రములును వైజయంతియు నురస్థ్సలరత్నము శంఖచక్రము
    ఖ్యములును బొడ్డుఁదామరయుఁ గంకణకాంచీపదాంగదాదులున్.153
 
సీ. దివ్యసంయమిమనస్థ్సితిఁ బొల్చుమత్కుల
                      దైవంబుపదములఁ దలఁపుఁ జేర్తు
   నఖిలలోకస్రష్ట యగుబ్రహ్మఁ గన్నమ
                      త్ప్రాణబంధువునాభి నాత్మఁజేర్తు
   దైతేయకంఠనిర్దళనంబు లైననా
                      స్వామిహస్తముల భావంబుఁ జేర్తు
   లక్ష్మిచన్గవకు నలంకార మైననా
                      తండ్రివక్షమునఁ జిత్తంబుఁ జేర్తు