పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కళాపూర్ణోదయము

    గరము మెచ్చొనర్పఁ బరమనిరూఢి నా
    దరముతోడిభ క్తి గరిమఁ దనరి. 145

క. పావనగుణానుభావము
    భావన గావింప నెట్టిపరమనదులు నీ
    కావేరికి సదృశంబులు
    గా వేరికి నైనఁ బొగడఁగా వెర వగునే.146

లయ. ఈనది ప్రవాహయుగళీనిభవిభాసితభు
                        జానియతరంగసదనూనపరిరంభం
       బీనది భజన్నిఖిలమానవమనఃకలుష
                        తానిరసనాతిపటుతానుతజలౌఘం
       బీనది సమస్తతటినీనికరదుష్కరత
                        రానుపమచిద్విభవదానమహనీయం
       బీనది పవిత్రతరమీనది శుభైకనిధి
                        యీనది విముక్తికినిదానము గణింపన్ . 147

ఉత్సా. అమితరంగధామలక్ష్మి నరయఁ బృషతమణినికా
       యములఁ బూజసేయఁ దాల్చినట్టినేత్రభుజసహ
       స్రములు గాని జలరుహములు జలరుహములు గావు భం
       గములు భంగములును గావు గణన సేయ నీనదిన్. 148

మాని. బంగరు చేలయుఁ బద్మనిభాక్షులు బాహుచతుష్కము భవ్య విభో