పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

89

ద్వితీయాశ్వాసము

    శ్రీవరుగుణములు వీణా
    ప్రావీణ్యము పొలుపు మీఱ బాడుచు సంతన్.

వ. మధుర సేవించి యంతట హరిద్వారంబును సాలగ్రామపర్వతంబును బదరికాశ్రమంబును
   నైమిశారణ్యంబును గురుక్షేత్రంబును బ్రయాగయుఁ గాశియు నయోధ్యయు గంగాసాగరసంగమంబును
   స్నానదానాదినిధు లనూనంబుగానడుపుచు దర్శించి యంత నుదధితీరంబున నీలాచలసన్నిధికి నే
   తెంచి.

క. ఇది సాక్షా ద్వైకుంఠం
   బిది నానామునితపస్సమృద్ధివిపాకం
   బిది పరమం బిది శరణం
   బిది పుట్టినయిల్లు సిరుల కెల్లఁ దలంపన్ .

తే. అని నుతించి యింద్రద్యుమ్న మనుసరసిని
    రోహిణీకుండమున సమారూఢభక్తి
    దీర్థమాడుచు నాతఁ డాత్మీయగాన
    నైపుణి వెలార్చుచును జగన్నాధుఁ గొలిచి.

సీ. ఇత్తెఱంగునఁ బురుషోత్తమశ్రీజగ
                   న్నాధునిసంసేవనమునఁ దనరి
   శ్రీకూర్మవిభునియంఘ్రీసరోరుహంబులు
                   గనుఁదమ్ములకు విందుగా నొనర్చి