పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కళాపూర్ణోదయము

    క్ష్మీవరనిత్యసన్నిధివిశేషమహత్త్వ మెఱింగినంతనే
    యావిభవంబుఁ గాంచుటకు నాసయొనర్చితిగాన నెమ్మెయిన్ . 110

క. కావున నీ వడిగినయ
    ద్దేవునియనవరతసన్నిధిమహత్త్వవిశే
    షావాప్తికిఁ బెద్దలచే
    నే వినినయుపాయ మిప్పు డెఱిఁగింతుఁ దగన్. 111

క. అధికారి కానివానికి
    నధికపదవి దెలుపఁ బ్రాప్త మయ్యెడుపాపం
    బధికారి యైనవానికి
    నధికపదవి దెలుప కున్న నగు నిక్కముగన్. 112

వ. అని యిట్లని చెప్పె. 113

సీ. తనశక్తికొలది సత్కర్మము ల్ఫల వాంఛ
                    మాని కృష్ణార్పణమతిఁ జలుపుట
     ప్రతిషిద్ధకర్మంబు పరిహరించుట విష్ణు
                    భక్తి పైక్రమమునఁ బాదుకొనుట
     తద్భక్తి గలపుణ్యతములసంసర్గంబు
                    దుర్జను లున్నట్టిత్రోవఁ జనమి
     విష్ణుసన్నిధికళావిఖ్యాతవివిధది
                    వ్యక్షేత్రతీర్థయాత్రాచరణము

గీ. బ్రహ్మచర్యంబుఁ దపము వైరాగ్యగుణము

    వలయు వైకుంఠమును గోరువారి కెల్ల