పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

కళాపూర్ణోదయము



వ. అని చెప్పి మఱియు ని ట్లనియె. 102

క. ఏ నిన్ని పాట్లఁ బడి యీ
    గానమహిమఁ గంటి నీవుఁ గలభాషిణియున్
    మేను చెమర్పక యుండం
    బూనితి రిది యప్రయాసమున హరికరుణన్. 103

క. అనుడు మిముఁ గొలుచుపుణ్యం
    బునకిది యరుదయ్య ఘనతపోధన త న్నం
    దినవారు తనంత లనన్
    వినరే లోకోక్తి మీరు విశ్వంభరలోన్. 104

మ. అది యట్లుండె నొకప్డు తుంబురుని దా నారీతిఁ బిల్పించియిం
    పుదలిర్పన్ హరిపాటవింటమిగులం బూజ్యబుగాఁ జెప్పి తే
    కొదయున్ లేక సదానివాసముగ వైకుంఠంబులోనుండియా
    సదయు న్విష్ణుని గొల్వఁగలెడుమహాసౌభాగ్య మెట్లబ్బునో 105

క. అనుటయు నమ్మాటకు నె
    మ్మన మలరఁగ నతనిఁ జూచి మణికంధర య
    త్యనముఁడవు మేలు మే లీ
    యనుపమసద్బుద్ధి యేరికైనను గలదే. 106

క. వినరే యెవ్వరుఁ బాపం
    బనఁ బుణ్యం బన ని షేధ మన విధి యనఁ గీ