పుట:కపాలకుణ్డలా.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

క పాల కు ం డ లా పోన గును ? అని యడిగెను. పల్లెవాఁడు (ఓడనడుపువాఁడు) అట్టిట్టు చూచి చెప్పుటకు కాద నెను. వృద్దుఁడు క్రుద్దుఁడై వల్లె వానిని తిరస్కరించెను. యువ కుఁడు, స్వామి! ఏది జగదీశ్వరుని యిష్టమునందున్నదో దానిని పండితులు కూడ చెప్ప లేరు. ఈ మూర్ఖు లేమి చెప్పఁగలరు ? తాము కోపము ' చేయఁగూడద నెను. _వృద్ధుఁడు ఉగ్రభావముతో, కోపము చేయఁ గూడదా ? నీవు చెప్పుము, చూతము ; ఎవరోదొంగలు ముప్పది యేక రాల భూమియందున్న పంటనంతయు నురుచుకొనిపోయిరట ! ఇంక సంవత్సరము దాఁక పిల్లలు తినే దేమి ? చెప్పుమనెను. " వృద్ధుఁడు ఈ సమాచారమును ఊరినుండివచ్చిన ప్రయాణి కులవలన తెలిసికొనెను. యువకుఁడు, నేను - తమతో ముందే గ్రామము విడిచివచ్చుట సరి కాదని చెప్పినాను. తమయింట చూచుకొనువా రెవరును లేరు ; తామువచ్చినది సరి కాద నెను. ముసలివాఁడు ముందువ లెనే కోపభావముతో, రాధ గదా ! ముప్పాతిక కాలము ముగిసెను ; ఇక నుండు మేమి నిజము ? ఇపుడై నను పరలోకసాధనమైన పనిని చేసికొనకున్న యెడల మ జెప్పుడు చేయనగును ? అనెను. యువ కుఁడు, నాకు శాస్త్రము తెలియదు. విన్న దానిని చెప్పుచున్నాను ఏమనఁగా, తీర్థయాత్రలచేతను దేవతా దర్శనముల చేతను కాఁదగిన పరలోకసాధన ములను గృహము నందుండియే చేసికొనవచ్చునని వినియున్నాను, అనెను, - వృద్ధ—అట్లయిన నీ వేలవచ్చితివి ?