Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1108

కథాసరిత్సాగరము. లం. 10. త. 5.

రా జడుగఁగా ఈర్ష్యాళువు యధార్థమును తెలుపుకొనెను. రాజు తత్త్వ మెఱిఁగి ఆ పాపాత్మురాలిని ముక్కు సెవులు కోయించి వెడలఁగొట్టెను, దానిపతిని విడిచి పెట్టెను, వాఁడును కుస్త్రీస్నే హాగ్రహము తొలఁగి తనయింటికిఁ బోయెను. దేవా, ఈర్ష్య యే స్త్రీలకు అన్యపురుషాసంగమును నేర్పును. కావున బుద్ధిమంతుఁడు ఈర్ష్యను చూపకయే స్త్రీని కాపాడుకో వలసినది.

స్త్రీలకు రహస్యము చెప్పఁగూడదు.

మఱియు మేలు గోరిన వాఁడు స్త్రీలకు రహస్యమును చెప్పఁ గూడదు, వినుము. నాగుఁ డొకఁడు గరుడభయమున పలాయితుఁ డై వచ్చి భూలోకములో మనుష్య రూపమును ధరించి ఒకానొక వారయువతి యింట దాఁగియుండెను. ఆగణిక రాత్రికి ఏనూఱు ఏనుఁగులను బాడిగ పుచ్చుకొనునది, నాగుఁడు దినదినము తనప్రభావముచే అంతబాడిగను ఇచ్చుచుండెను. 'నీకు ప్రతిదినము ఇన్ని ఏనుఁగులు ఎట్లు కలుగును ? నీ వెవరవు చెప్పుము.' అని యావిలాసిని నిర్బంధింపఁగా మదనమోహితుఁడై నాగుఁడు 'ప్రేయసీ, ఎవరితోను చెప్పకుము, నేను గరుడ భయమున వచ్చి ఇచట దాఁగి యున్నాఁడను, నాగుఁడను.' అని చెప్పెను. గణిక యీ రహస్యమును, కుట్టినికి చెప్పెను. ఇంతలో గరుడుఁడు లోక మంతయు వెదకుచు పురుషాకృతితో వచ్చి కుట్టినిని 'ఈ దినము నేను నీకూఁతుతో నుండెదను, బాడిగ కై కొమ్ము' అనెను. 'ఇచట నాగుఁడు ఉన్నాఁడు, దిన