చిత్రాంగాగమనము.
1103
అన్నార్థ మై దుముకుటకు శక్తి కలుగ లేదు. పురుషులకు ధనమే యౌవనము, ధనాభావమే ముసలితనము. ధననాశముచే పురుషునికి తేజస్సు, బలము, ఉత్సాహమును నశించిపోవును. అది మొదలు నా పొట్టమాత్రము నిండించు కొనుటకు యత్నించుచున్న నన్నుఁ గని నా పరివారపుటెలుక లెల్ల నన్ను వదలి వెడలి పోయినవి. అన్నము పెట్టని ప్రభువును భృత్యులును, పువ్వులు లేని చెట్టును తుమ్మెదలును, నీరు లేని సరస్సును హంసలును, చిరకాలసేవితము నయినను వదలుట నిక్కము. ఈప్రకార మచట చిరకాలము దుఃఖితుండ నై ఈ లఘుపాతిని మిత్త్రునిగాఁ పొంది చివరకు, ఓ కూర్మరాజా, నీసన్నిధికి వచ్చితిని.
హిరణ్యకుఁడు ఇట్లు చెప్పఁగా మంథరకుఁ డనియె:- మిత్త్రమా, ఈచోటు నీదే, అసంతుష్టిగా నుండకు., గుణవంతునికి విదేశము లేదు, సంతుష్టునికి అసుఖము లేదు, ధీరునికి విపత్తు లేదు, సప్రయత్నునికి అసాధ్యము లేదు.
చిత్రాంగాగమనము.
ఇట్లు కూర్మము పలుకు చుండఁగా, చిత్రాంగ మను లేడి దూరమునుండి వ్యాధుఁడు వెంటఁ దఱుమఁగా ఆ యడవికి వచ్చెను. దాని రాకను, దాని వెంట రాక వ్యాధుఁడు నిలిచి పోవుటను, గని కూర్మాదులు దాని నోదార్చి దానితో సఖ్యము చేసినవి. కాక కూర్మ మృగాఖువులు అన్నియు అచటనే