1096
కథాసరిత్సాగరము. లం. 10. త. 5.
పథికఖల్వాటులు.
ఖలతి కథను వినుము. రాగిచెంబును బోలిన బట్టతలవాఁడు ఒక మూర్ఖుఁడు ఉండెను. వాఁడు వెలఁగచెట్టు క్రింద కూర్చుండఁగా, ఒకబాటసారి వయసువాఁడు మార్గాయాసముచే ఆఁకలిగొని అచటికి వచ్చి వెలఁగపం డొకటి కోసి క్రీడఁగా వాని నెత్తిమీఁద వేసెను. ఖలతి దానిని సహించెను గాని తరుణుని ఏమియు అన లేదు. క్రమముగా వాఁడు చెట్టులోని పండ్ల నన్నిటిని కోసి ఒక టొకటిగా ఖల్వాటుని తలమీఁదనే వేయు చుండెను. ఖల్వాటుఁడు తల పగిలి రక్తము ధారలు ధారలుగా కాఱుచు ఉన్నను ఊరక యుండెను. మూర్ఖతరుఁడు బాటసారి పండ్లన్నియు ఈప్రకారము చిద్రుపలై పోఁగా తినుట కేమియు లేక ఆఁకటితోనే వచ్చినట్లే పోయెను. ఖల్వాటుఁడు 'తియ్యని వెలగపండ్లతో బెబ్బలు ఎన్నియేనియు తిందును.' అని యనుకొనుచు నెత్తినుండి కాఱుచున్న రక్త ధారలతో ఇంటికిఁ బోయెను. మూర్ఖ సామ్రాజ్య పట్టము చేతనుంబోలె నెత్తుటి పట్టముతో వేష్టిత మైన వాని శిరమును గని లోకులు మిగుల పరిహసించిరి.
దేవా, ఈరీతిని లోకములో బుద్ధిహీనులు అపహాస్యు లగుదురు, కార్యమును చెఱుచుకొందురు; బుద్ధిమంతులు గౌరవము పొందుదురు. ఇట్లు గోముఖుఁడు చెప్పిన మూర్ఖుల తెలివి తక్కువ కథలను విని నరవాహనదత్తుఁడు ఆహ్నిక