Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1094

కథాసరిత్సాగరము. లం. 10. త. 5.

తన దూదిని గూడ ఆప్రకారమే శుద్ధిచేయఁ గోరి దానిని అగ్నిలో వేసెను. అది దగ్ధ మాయెను. లోకులు వాని తెలివికి నవ్విరి.

ఖర్జూరీచ్ఛేదకులు.

తూలికుని వింటివి. దేవా, ఖర్జూరీచ్ఛేదకులను వినుము. దివాణమువారి యాజ్ఞప్రకారము గ్రామ్యులను కొందఱను ఆ రామాధికారులు ఖర్జూరపు మొలకలు తెమ్మని యాజ్ఞాపించిరి. వారు సులువుగా పండ్లు కోసికొనుటకు అనుకూలముగా పండ్లతోఁ విఱిగిపడి యున్న యొక ఖర్జూరవృక్షమును చూచి తమ గ్రామములోని ఖర్జూరవృక్షముల నన్నిటిని కొట్టి వేసి పండ్లతోను కాయలతోను ఉన్నట్టి యా వృక్షముల నన్నిటిని తెచ్చి నగరి తోఁటలో నాటిరి. అవి సిద్ధింప లేదు. రాజు ఆ వృత్తాంత మెఱిఁగి ఖర్జూరముల నన్నిటిని నాశము చేసినందులకు వారిని దండించెను.

నిధ్యాలోకనుఁడు.

ఖర్జూరహాసు లయినారు, నిధ్యాలోకనుని వినుము. ఒకానొకరాజు నిధానములు కనఁగలవాని నొకని తెప్పించెను. వీఁడు మఱి యెచటికిని పాఱిపో కుండును గాక యని మంత్రి కన్నులు పెఱికి వేయించెను. భూమియొక్క లక్షణములను కనలేక రాకకు పోకకు భేదము కనలేక యున్న యా నిధాన దర్శిని చూచి లోకులు మంత్రి తెలివికి మిక్కిలి నవ్విరి.