భద్రఘటము కథ.
1019
దగ్ధుఁడను నేను ఇది దొరకఁగానే పుచ్చుకొంటిని.' అని భారికుఁడు పలికెను. అంత సభ్యులు రత్నమును గుఱించి వణిజుని ఆక్షేపించిరి. 'నేను వెల యిచ్చి బజాఱులో కొంటిని, దానిపై రాజుగారి గుఱుతు లేదు. దానివెలలో వీఁడు అయిదువేలు కొనిపోయినాఁడు, మిగత నాయొద్దనే ఉన్నది.' అని హిరణ్యగుప్తుఁడు చెప్పెను. ఈ మాటవిని యౌగంధరాయణుఁడు 'ఈ విషయములో, ఎవరిదియు దోషము గాదు. పేదవాఁడు అక్షర మెఱుఁగనివాఁడు ఈకూలివాఁడు. దారిద్ర్యముచే దొంగతనము కూడ చేయుదురు. దొరకినదానిని ఎవరు వదలుదురు ! ఈ వణిజుఁడు వెల యిచ్చి రత్నమును గ్రహించినాఁడు. కనుక ఇతని యందును తప్పు లేదు. ' అని చెప్పెను. ఆ మహామంత్రి వచనమును నత్సరాజు అంగీకరించెను. భారికుఁడు వ్యయము చేసికొన్న యైదువేలను ఇచ్చి రాజు హిరణ్యగుప్తునివలన ఆరత్నమును పుచ్చుకొని భారికునివలన కడియమును పుచ్చుకొని వారిని పంపెను. అయిదువేలు వ్యయము చేసికొన్న వాఁ డై భయము తీఱి భారికుఁడు పోయెను. 'నమ్మినవానిని ద్రోహముచేసినవాడు వీఁడు పాపాత్ముఁడు.' అని రాజు మనస్సులో రత్నదత్తుని ద్వేషించుచునే కార్యగౌరవముచే ఆదరించెను.
భద్రఘటము క థ.
వారు పోయినపిమ్మట రాజుమ్రోల వసంతకుఁడు ఇట్లనియె: ఆహా! దైవనిహతులకు అర్థము దొరకినను నిలువదు.