1082
కథాసరిత్సాగరము. లం. 10. త. 4.
జనులచేత మోఁదులు వడి మడిసెను. ఈరీతిగా హితము విననివాఁడు కఱ్ఱను విడిచిన కూర్మమువలె చేటొందును.
మూఁడుచేఁపలకథ.
ఇట్లు భార్య పలుకగా టిట్టిభము బదులు చెప్పెను:- “ప్రేయసీ, నీవు చెప్పినమాట సత్యమే. అయినను నీవును ఈకథ వినుము. ఒకనదిలో ఒకచోట మడుఁగులో మూఁడు చేఁపలు ఉండినవి; అనాగతవిథాత, యద్భవిష్యకము, ప్రత్యుత్పన్నమతి అని వానిపేరులు ; మూఁడును సహవాసగాండ్రు. ఒకనాఁడు జాలరులు ఆదారిని పోవుచు 'ఆహా! ఈ మడుఁగులో చేఁపలు విశేషముగా నున్నవి !' అని ఒకరితో నొకరు చెప్పుకోఁగా, ఈ మూఁడు చేఁపలు విన్నవి. అంతట బుద్ధిమంతుఁ డనాగతవిధాత జాలరులవలన తనకు చావు అగు నని వెఱచి ప్రవాహములోఁ బడి మఱి యొక చోటికిపోయెను. ప్రత్యుత్పన్నమతి 'అపాయము కలిగిన యెడల, నేను ఉపాయముచే తప్పించుకొనియెదను.' అని అచటనే యుండెను. 'నా కేమి కలుగును ?' అని యద్భవిష్యుఁడు అచటనే యుండెను. ఇట్లుండఁగా జాలరులు వచ్చి వలలు వేసిరి. వారు వలలోఁబట్టి యెత్తఁగా ప్రత్యుత్పన్నమతి కదలక మెదలక చచ్చినట్లు పడి యుండెను. అది స్వయముగానే చచ్చిన దనుకొని జాలరులు దానిని కొట్టక విడిచి పెట్టిరి. అంతట నాచేఁప నదీప్రవాహములో తప్పించుకొని పోయినది. యద్భవిష్యము వలలోనేఎగురుచు దొరలుచు ఉండెను. దానిని