Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1018

కథాసరిత్సాగరము. లం. 10. త. 1.

ఆస్థానమం దుండఁగా ఒక వర్తకుఁడు రత్నదత్తుఁ డనువాఁడు ప్రతిహార నివేదితుఁ డై రాజానుఙ్ఞాతుఁ డై వచ్చి రాజునకు ప్రణమిల్లి ఇట్లు విన్నపము చేసికొనెను. "దేవా, వసుధరుఁ డని ఈనగరములో దరిద్రుఁడు బరువులు మోచువాఁడు ఒకఁడు కలఁడు. వాఁడు ఇప్పుడు ఆకస్మికముగా త్రాగుచు భుజించుచు సుఖముగా నున్నాడు. దానిని చూడఁగా కౌతుకమై వానిని మాయింటికిఁ గొనిపోయి మత్తెక్కఁ ద్రాగించి యడుగఁగా వాఁడు చెప్పిన దే మనఁగా 'రాచనగరిద్వారమున రత్నఖచితమైన కడియము నాకు దొరకినది. అందునుండి ఒక రత్నము పెకలించి విక్రయించితిని. లక్ష దీనారములు వెల యొసఁగి దానిని హిరణ్యగుప్తుఁ డను వణిజుఁడు కొన్నాఁడు. అందువలన నేను సుఖముగా జీవించుచున్నాను.' ఇట్లు పలికి వాఁడు ఏలినవారిపేరు చెక్కిన యాకడియమును చూపినాఁడు. "నేను ఏలినవారికి విన్నవించితిని.” వత్సరాజు విని కడియము తోఁగూడ భారికుని, రత్నముతోఁ గూడ వణిజుని రప్పించెను.

'ఆహా ! జ్ఞప్తికలిగినది ! ఇది నాచేతినుండి ఊరేగింపులో జాఱిపడిపోయినది!' అని ఆకటకమును రాజు జ్ఞప్తిచేసికొని పలికెను. రాజునెదుట సభ్యులు 'ఓరీ, రాజుపేరుచెక్కిన యీ కడియము నీకు దొరకిన నీవు దానిని ఎట్లు ఉంచుకొన్నావు?' అని యడుగఁగా, 'బాబూ, బరువులుమోచు కూలివాఁడను, నాకు రాజనామాక్షరములు ఎట్లు తెలియును, దారిద్ర్యదుఃఖ