సింహశశక కథ.
1073
మత్స్యములకడకుఁ బోయి జరిగినవృత్తాంతమును వానికి చెప్పి వాని ప్రాణములను రక్షించెను. అవియును మిగుల సంతసిల్లినవి.
కావున ప్రజ్ఞయే బలము, ప్రజ్ఞ లేనివానికి బలమువలన ప్రయోజనము లేదు. సింహశశక కథను వినుము.
సింహశశక కథ.
పూర్వ మొక యడవిలో మహాపరాక్రమశాలి ఓటు లేనిది సింహ మొకటి అగపడిన జంతువు నెల్ల సంహరించుచు ఉండెను. అంత నడవిలో మృగము లెల్ల కలయఁ బలికికొని దానితో "ఓ మృగేంద్రా, నీకు దినమున కొక్కజంతువును ఆహారార్థము పంపెదము, ఒక్కమాఱే జంతువుల నెల్లఁ గూల్చి ఏల స్వార్థహాని చేసికొనియెదవు?" అని విన్నవించుకొన్నవి. అందులకు సింహము అంగీకరించెను. నాఁటనుండియు దినమున కొకజంతువును సింహము ఆరగించుచుండఁగా, ఒకనాఁడు ఒక చెవులపిల్లికి వంతు వచ్చినది. మృగము లెల్లను పంపఁగా తరలి వచ్చుచు బుద్ధిశాలి యా శశకము తనలో తా నిట్లాలోచించెను. 'ఆపత్కాలమందు తెలివి కోలుపోనివాఁడే గదా ధీరుఁడు. కావున మృత్యువు ఆసన్న మై యున్న నేను ఒక యుపాయము పన్నెదను.' ఇట్లాలోచించి శశకము సింగమునొద్దకు ఆలస్యముగా పోయి చేరెను. అట్లు తామసించి వచ్చిన శశకముతో సింహము 'ఓరీ శఠుఁడా, నా భోజన వేళను దాఁటి వచ్చితి వేమి! నీకు చావుకంటె ఎక్కువ బాధ