Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంగను చంపిన యెండ్రి కథ.

1071

ప్రణమిల్లిన సంజీవకమును సింహము 'రా, నాయొద్దనే ఇచ్చట నిర్భయముగా ఉండుము.' అని సత్కరించెను. అట్లే ఎద్దు అచటనే యుండెను; క్రమక్రమముగా ఆయిరువురమైత్త్రియు బలపడి, మృగరాజు ఇతరులయందు విముఖుఁ డయి సంజీవక తత్పరుఁ డై యుండెను.

ఆ స్థితిని గని ఖిన్నుఁ డై దమనకుఁడు కరటకునితో నిట్లనియె. “చూచితివా, మనదొర కేవలము సంజీవకుని వసమైనాఁడు, మనవైపు చూడను గూడ చూడఁడు. తాను ఒంటిగానే మాంసము భక్షించుచున్నాఁడు, మనకు పాలు ఇచ్చుట లేదు. ఈ ప్రభువు మూర్ఖుఁడు, వీనికి ఎద్దు నేర్పుచున్నది. ఈ యెద్దును తెచ్చుటయే నా తప్పు, కనుక ఈ యెద్దునకు ముప్పు కలుగునట్లు ప్రయోగము చేసెదను. మనప్రభువు ఈ యనర్హుని వదలునట్లు చేసెదను.” కరటకుఁడు 'చెలికాఁడా, ఇప్పుడు ఇట్లు చేయుటకు నీకుఁ గూడ శక్యము గాదు, ' అనెను. అందులకు దమనకుఁడు 'చేసెదను చూడు నాప్రజ్ఞ, ప్రజ్ఞగలవాఁడు ఏమిచేయ లేఁడు! ఇందుల నిదర్శనము, వినుము.' అని చెప్పఁదొడంగెను.

కొంగను చంపిన యెండ్రి కథ.

పూర్వము మత్స్యసమృద్ధ మయిన యొకసరసులో ఒక కొంగ యుండెను. దానికంట పడక భయముచే మత్స్యములు దాఁగుచుండినవి. వానిని పట్టుకొన లేక కొంగ వానితో నిట్లు బొంకెను — ఓ చేపలారా ఇచటికి జాలరి ఒకఁడు వచ్చి