1062
కథాసరిత్సాగరము. లం. 10. త. 3.
నేను నవ్వితిని. ఈకథను రాజసభలో చెప్పి ఇతఁడు విముక్తుఁడగును. సోమప్రభుఁడు ఇతనికూఁతును మకరందికను ఇప్పుడు నిషాదియైన దానిని ఇఁకను విద్యాధరజన్మమందు పొందఁగలఁడు. మనోరథప్రభయు ఇప్పుడు రాజుగా పుట్టి యున్న రశ్మిమంతుని అప్పుడే పతినిగా పొందఁగలదు. సోమప్రభుఁడు తండ్రినిదర్శించి యిప్పుడు ఆశ్రమమునకుఁ బోయి ప్రియాప్రాప్తికై ఈశ్వరుని గూర్చి, తపస్సు చేయుచున్నాడు.
ఇట్లు పలికి పులస్త్య మహాముని విరమించెను. నేనును పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొని హర్ష శోక పర్యాకులుఁడ నైతిని. నన్ను ఆశ్రమమునకుఁ గొని పోయిన యా మరీచిముని పెంచుచుండెను. నాకు ఱెక్కలు రాఁగానే పక్షిజాతి సులభ మయిన చాపలముచేత నేను అచట నచట తిరుగుచు విద్యామహిమలను ప్రకటించుచు కడపట నిషాద హస్తగతుఁడ నై యిప్పుడు నీ సన్నిధికి వచ్చితిని. ఇప్పుడు నాకు పక్షిజన్మ కారణ మయిన పాపము తీఱినది.
ఇట్లు చిత్రవాక్కులతో సభలో కథ చెప్పి ఆ శుకము విరమించెను. ఆ రాజు ప్రమోదభరితాంతరంగుఁ డాయెను. ఈ లోపల సోమప్రభునితో తపస్తుష్టుఁడైన మహేశ్వరుఁడు, స్వప్నమందు దర్శన మొసంగి యిట్లాన తిచ్చెను: “రాజా, లేలెమ్ము ; సుమనోరాజుకడకుం జనుము, అట నీప్రాణప్రియను గూడెదవు. తండ్రిశాపంబుచే ముక్తాలత యను పేర నిషాది యై మకరందిక