మకరందిక కథ.
1059
తుఁడు గాక నాకూఁతురు మకరందిక వివాహమాడదఁట. కనుక నీవే వచ్చి యీమెను వివాహార్థము బోధింపుము.' ఈ మాట విని సఖీస్నేహముచే అచటికి మనోరథప్రభ బయలువెడలఁగా సోమప్రభుఁడు 'ఓ మహానుభావురాలా, విద్యాధర లోకము చూచుటకు కుతూహలముగా నున్నది. నన్నుఁ గూడ కొనిపొమ్ము. అశ్వము ఇక్కడనే గడ్డి మేయు చుండును గాక.' అని యడిగెను. ఆమెయు అంగీకరించి సోమప్రభుని దేవజయుని యొడిలో కూర్చుండఁ బెట్టి సఖీయుత యై అందఱతోను ఆకాశమార్గమున మకరందికయొద్దకుఁ బోయెను. ఆమె ఆతిథ్యము చేసి మనోరథప్రభను, ఇతఁ డెవ రని సోమప్రభునిఁ గూర్చి యడిగెను. ఆమె యాతని వృత్తాంతమును చెప్పెను. మకరందికా మానసమును సోమప్రభుఁడు దర్శనమాత్రముననే హరించెను. అతఁడును ఆమెను రూపవంతురా లయిన లక్ష్మినిగా మనస్సునఁ నెంచి, ఈమెకు తగినవరుఁడు ధన్యుఁ డెవఁడు, అని తలంచెను. పిమ్మట స్వైరాలాపములతో మనోరథప్రభ మకరందికను 'ఓ చండీ, వివాహ మేల ఒల్లవు?' అని యడిగెను. 'నీవు వరుని అంగీకరింపక యుండఁగా, ప్రాణాధిక వయిన నిన్ను అతిక్రమించి నేనుమాత్ర మెట్లు వివాహ మగుదును?' అని మకరందిక సప్రణయముగా పలికెను. మనోరథప్రభ అనియె. - 'ముద్దరాలా, నేను వరుని వరించితిని, అతని సంగమము నెదురు సూచుచు ఇచట నున్నాను.' అంత మకరందిక 'అట్లయిన నీమాటప్రకా