1422
కథాసరిత్సాగరము. లం. 12. త. 8.
యాటక్రోఁతిపిల్లకు ఆపం డిచ్చెను. క్రోతిఁపిల్ల దానిం దినుచు పగుల్పఁగా అందుండి వెలలేని మేలిరత్న మొకటి క్రిందఁబడెను. దానిం గని కైకొని రాజు భాండాగారికునిం బిలిపించి 'ఓయి, ఆ సన్న్యాసి నిత్యము నిచ్చుచుండిన పండ్లు నీచేతి కిచ్చుచుంటినే అవియేవి?' అని యడిగెను. అతఁడు భయముతో 'దేవా, వానిని తలుపు తీయకయే నేను దొడ్డిదారిని గంజములోపల వేయుచుంటిని. ఇపుడు దేవరయాజ్ఞయేని తలుపు తెఱచి చూచెదను.' అని విన్నవించెను. అందులకు రాజు అంగీకరింపఁగా కోశాధ్యక్షుఁడు పోయి క్షణములో మరల వచ్చి 'దేవా, ఆపండ్లు క్రుళ్ళిపోయినవి, అవి యగపడలేదు గాని యిపు డచ్చోట గొప్పరత్నాలప్రోవు జ్వలించుచున్నది.' అని విన్నవించెను. విని సంతసించి రాజు అమణులు ఆకోశరక్షకుని కిచ్చివేసెను. మఱునాఁడు మరల భిక్షువు యథాపూర్వము వచ్చి పండు కానుకవెట్టఁగా, రాజు ఇతనితో 'ఓభిక్షూ, ప్రతిదినము నిట్లు ధనము వ్యయించి నన్నుఁగొలిచెదవేల? కారణము చెప్పువఱకు ఇపుడు నీఫలమును నేను గ్రహింపను.' అనెను. భిక్షువు రాజుతో ఏకాంతమున 'రాజేంద్రా, వీరుని సాయము వలసిన మంత్రసాధన మొకటి నాకుంగలదు. అందు నీవు వీరవతంసుఁడవు నాకు సాయ మొనర్తు వని నాప్రార్థన.' అని విన్నవించెను. రా జందుల కంగీకరించెను. 'అట్లయిన ఈరాఁగలకృష్ణచతుర్దశి రాత్రి ఈ యూరి పెద్ద వల్లకాటిలోని మఱ్ఱి