Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1394

కథాసరిత్సాగరము. లం. 12. త. 7.

బిలిచి 'పుత్త్రా, నట్టువదానివలపుగాఁడై తండ్రి నిన్ను త్యజించినాఁడు, నీవు పాటలీపురమునకు మీమాతామహుని యింటికిం బొమ్ము. ఆయనకు పుత్త్రులు లేరు. ఆయన నీకు తన రాజ్య మిచ్చును. ఇట బలవంతుఁడు శత్రువు సమరభటుఁడు నీకు ప్రాణాపాయము సేయును' అని బోధించెను. 'అమ్మా, క్షత్త్రియుఁడ నయ్యు నేను పందవలె వెఱచి దేశము వదలి పోవుదునా? అమ్మా, నీవు ధైర్యముతో నుండుము, ఈక్రించు న న్నేమి సేయగలఁడు!' అని భీమభటుఁడు తల్లి కుత్తర మీయ, ఆమె వెండియు 'అ ట్లేని పుత్త్రా, నాధనములం గొని నీవు పెక్కురను సహాయులం గూర్చుకొమ్ము.' అని చెప్పెను. భీమభటుఁడు అది సరిగా దనియు, అట్లు చేసిన తండ్రిపై శత్రుత్వము వహించిన ట్లగు ననియు, ఆమెదీవనలచేతనే తనకు మేలగు ననియు, చెప్పి సమాథానపఱిచి, ఆమెను వీడ్కొనెను. అంత నీవృత్తాంత మెఱిఁగి పౌరు లందఱును 'ఓహో; భీమభటువిషయమై రాజు కర మనుచిత మాచరించినాఁడు. ఇతని రాజ్యమును హరించుటకు సమరభటుఁడు సమర్థుఁడు గాఁడు, కావున భీమభటునికి పూర్వసేవ సేయుటకు మన కిది సమయము.’ అని కలయఁ బలికికొని, రహస్యముగా నతనికి భృత్యవర్గ సమేతముగా సుఖం బుండఁ జాలినంత ధనము నొసంగిరి. తమ్ముఁ డితనిం జంప నుపాయమునే వెదకు చుండెను. తనకై పరివారాది సామగ్రీసమృద్ధి నిడిన తండ్రికిని అదే యాలోచన పుట్టిం